ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిఽథులుగా ఆదిత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్.జగదీశ్వరి, శ్రీవిద్య కాలేజి ప్రిన్సిపాల్ ఆర్.దామోదర్ రావు, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ జయ ప్రకాష్ పాల్గొని కరాటే ప్రాధాన్యతను వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్‌ని అందచేశారు. కరాటే మాస్టర్లు సెన్సాయ్ ఎస్.దుర్గారావు, పి.మురళి, ఎం.కరుణాకర్, వీటి బద్రినాఽథ్, డి.ప్రభాకర్, శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిర్వాహకులు బల్లం కిషోర్ టోర్నమెంట్‌ను విజయవంతం కావడానికి సహకరించినవారికి ధన్యవాదాలు తెలియచేశారు.


