కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు. గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మంగ్యా వైద్య ఖర్చుల నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం. మంగ్యా మృతదేహాన్ని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, స్థానిక నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి తదితరులు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కృష్ణా నదీ జలాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోందని, మండలంలో కిడ్నీ రోగులకు వైద్యసేవలందించడంలో కూడా ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని వారు విమర్శించారు.


