సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
గన్నవరం: సమస్యల పరిష్కారం కోసం పోరాటామే ఏకై క మార్గమని ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక చింతపల్లి పాపారావు భవన్ ప్రాంగణంలో ఆదివారం యూనియన్ 9వ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు నిరంతరం సమస్యలతో సహజీవనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు పెంచుతామనే హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. తొలుత యూనియన్ పతకాన్ని సంఘ నాయకులు నాగమణి అవిష్కరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. పోలినాయుడు, బుద్దవరం సర్పంచి బడుగు బాలమ్మ, సీఐటీయూ నేతలు బెజవాడ తాతబ్బాయి, కె. రామరాజు, సీపీఎం నేతలు ఎం. ఆంజనేయులు, సూరగాని సాంబశివరావు, కై లే ఏసుదాసు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక....
అనంతరం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కె. శ్రీనివాసరావు, ఎం. పోలినాయుడు, ఆఫీస్ బేరర్స్‌గా ఎం. గణేష్, పి. కృష్ణకుమారి, ఎం. ప్రభుశేఖర్, టి. అబ్రహం, కె.రాజేష్, వి.శ్రీనివాసరావు, ఎం.జగన్, ఎం.రామకృష్ణ, మరో 18 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


