షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరం: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్–17 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా జట్ల ఎంపిక ప్రకియ ఆదివారం ముగిసింది. స్థానిక కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్‌కు ఉమ్మడి జిల్లాలోని ఆరు డివిజన్‌లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు ఐదుగురు చొప్పున జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. అలాగే అండర్–14 గుడివాడ డివిజన్ ఎంపికలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. ముగింపు వేడుకల్లో స్రవంతి హైస్కూల్ ప్రిన్సిపాల్ కొమ్మినేని రామకృష్ణ పాల్గొని ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఆర్. కిషోర్, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, హీల్ సంస్థ ప్రతినిధి బి.సత్యనారాయణరావు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలుర జట్టు...
టి. శేషసాయిశ్రీనివాస్(ఎన్‌ఆర్‌ఎస్‌వీఆర్ కళాశాల, మైలవరం), ఇ. చరణ్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), షోయాబ్‌ఖాన్(డీఏవీ స్కూల్, ఇబ్రహీంపట్నం), పి.తేజస్విన్(లయోలా కళాశాల, విజయవాడ), పి. షాషిష్(ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నిడమానూరు)
స్టాండ్‌బై: వి.ఓంకార్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ).
బాలికల జట్టు...
ఐ.తన్వి(ఎట్కిన్సన్ స్కూల్, విజయవాడ), కె. తనూజ(కృష్ణవేణి కళాశాల, విజయవాడ), ఆర్. యస్వితసాయి(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), డి. తేజస్విని(నారాయణ స్కూల్, భవానిపురం), బి. వర్షిణి(ఎన్‌ఎస్‌ఎం స్కూల్, విజయవాడ)
స్టాండ్ బైః వి. ఆస్థ(స్టాన్‌రాక్ స్కూల్)


