కృష్ణానదిలోకరిగిపోయిన జింకపాలెం రోడ్డు | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలోకరిగిపోయిన జింకపాలెం రోడ్డు

Oct 30 2025 7:51 AM | Updated on Oct 30 2025 7:51 AM

కృష్ణానదిలోకరిగిపోయిన జింకపాలెం రోడ్డు

కృష్ణానదిలోకరిగిపోయిన జింకపాలెం రోడ్డు

నాగాయలంక: మండలంలోని ఎదురుమొండి దీవి నుంచి గొల్లమంద మీదుగా సముద్రతీర గ్రామం జింకపాలెం వెళ్లే ప్రధాన రోడ్డులో ప్రయాణం సందిగ్ధంలో పడింది. మోంథా తుపాను తాకిడికి ఈ రోడ్డు గొల్లమంద సమీపంలో పూర్తిగా కృష్ణానదిలో కనుమరుగైంది. దీంతో గొల్లమంద, జింకపాలెం ప్రజలు ప్రయాణమార్గం లేక ఆందోళన చెందుతున్నారు. తరచూ ఈ రోడ్డు కృష్ణానది ఉధృతికి కోతకు గురవుతోంది. రోడ్డు పునర్నిర్మాణం కోసం ఈ ప్రాంత బడుగు బలహీనవర్గాల ప్రజలు, మత్స్యకారులు నాయకులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని కూటమి నాయకులు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కలెక్టర్‌ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించి డెప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.13 కోట్లు మంజూరయినట్లు నాయకులు ప్రకటించారు. ఇది జరిగి నెలలు గడిచాయి. తాత్కా లిక మరమ్మతులకే రోడ్డు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మోంథా తుపాను ప్రభావంతో రోడ్డు పూర్తిగా నదిలో కలసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement