అప్పులు తీరేదెలా?
ఈ ఏడాది చేపట్టిన వాణిజ్య పంట ఏ ఒక్కటీ చేతి కందలేదు. గత జూన్‌లో మిర్చి సాగు చేస్తే మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కలేదు. నష్టాలు చవిచూశాను. మోంథా తుపానుతో చక్రకేళి అరటి తోట పూర్తిగా నేలవాలింది. అరటి సాగుకు రూ.1.75 లక్షల అప్పుచేసి పెట్టుబడి పెట్టాను. ఫల సాయం చేతికి అందే సమయంలో తుపాను కన్నీరు మిగిల్చింది. ఈ అప్పులు తీరేదెలానో అర్థం కావడంలేదు.
– మోర్ల శ్రీనివాసరావు, మోపిదేవిలంక, కృష్ణాజిల్లా
ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశా. గాలులకు పంట నేలవాలింది. భారీ నష్టం తప్పదు. అధికారులు సమగ్ర సర్వేచేసి పరిహారం అందేలా చూడాలి. ఎందుకంటే ఒక్క గింజ కూడా చేతికి రాదు. పెట్టుబడి మొత్తం పోయినట్టే. కౌలు ఎలా చెల్లించాలో? తలుచుకుంటేనే భయమేస్తోంది.
– మాదు రాజబాబు, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం
అప్పులు తీరేదెలా?
అప్పులు తీరేదెలా?


