గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రమేష్‌నగర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మృతి చెంది ఉంటాడా, లేక ఏదైనా వాహనం ఢీకొట్టి మరణించి ఉంటాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ విజయలక్ష్మి తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లుతో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.1 అడుగులు, ఎడమ వైపు మోచేతికి ఎస్‌ఎస్‌ఎస్ శ్రీను అనే పచ్చబొట్టు, కుడి చేతిపై ఎస్.పి అనే పచ్చ బొట్టు ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 90591 21109 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలియజేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


