
జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
అవనిగడ్డ: జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి, మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సిమెంటుపై పది శాతం, వెదురు ఫ్లోరింగ్‌పై ఏడు శాతం, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకపై ఏడు శాతం జీఎస్టీ తగ్గిందని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు సంచలనాత్మక నిర్ణయమని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్, జాయింట్ కమిషనర్ జి.కల్పన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయూత
పమిడిముక్కల: నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయాతనిస్తుందని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీరంకిలాకులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత మంత్రి సుభాష్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వీరంకిలాకు సెంటర్‌లో దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులకు కరపత్రాలు అందజేపి జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఉయ్యూరు ఆర్డీఓ హేలా షారేన్, మొవ్వ ఏఎంసీ చైర్మన్ దోనెపూడి శివరామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, కృష్ణాపురం డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎంపీడీఓ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.