
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
దసరా ఉత్సవాలను తలపించిన రద్దీ టికెట్ల విక్రయాలు, అంతరాలయం రద్దు అమ్మ దర్శనానికి మూడు గంటలు పైగానే క్యూలో..
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆదివారం ఒక్క రోజే 1.20లక్షల మంది రాక
చేతులెత్తేసిన అధికారులు..
నేడు ‘మీ కోసం’
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు
కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. మీ కోసం కాల్ సెంటర్(1100)కి కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు.
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 82,540 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 82,548 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు ఉంది.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిపించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు ముగిసి పది రోజులైనా కాకుండానే దసరా ఉత్సవాలను తలపించేలా ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. రికార్డు స్థాయిలో 1.20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవ, అనంతరం ఖడ్గమాలార్చన నిర్వహించారు. సాధారణంగా ఖడ్గమాలార్చన జరుగుతున్న సమయంలో సర్వ దర్శనంలో ఒక క్యూలైన్ మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఆదివారం ఖడ్గమాలార్చన జరిగే సమయానికి క్యూలైన్‌లో పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉండటంతో రెండు క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతించారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం 8 గంటలు గడిచే సరికి ఘాట్‌రోడ్డులో ఓం టర్నింగ్, మహా మండపంలో ఆరో అంతస్తుకు చేరింది.
పలువురు చిన్నారులకు అస్వస్థత..
అంతకంతకు ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. వీఐపీతో పాటు రూ. 500, రూ. 300, రూ. 100 క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు మొత్తం ఆరు క్యూలైన్ల ద్వారా భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఉదయం ఎప్పుడో క్యూలైన్‌లోకి ప్రవేశించిన వారికి దర్శనం కాకపోవడంతో ఉక్కబోతతో కొంత మంది చిన్నారులు కళ్లు తిరిగి స్పృహ కోల్పోగా, మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో కొండ దిగువన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వీఎంసీ కార్యాలయం మొదలు, కెనాల్‌రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, ప్రకాశం బ్యారేజీ, మోడల్ గెస్ట్ హౌస్, దుర్గాఘాట్, హెడ్ వాటర్ వర్క్స్, కుమ్మరి పాలెం వరకు ఎక్కడ చూసినా నిలిచిపోయిన వాహనాలే కనిపించాయి. టోల్‌గేట్ వద్ద అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కనిపించలేదు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులపై దర్శనానికి విచ్చేసిన వారందరూ తమ కార్లు కొండపైకి తీసుకువెళ్లాలని భావించడంతో ఘాట్‌రోడ్డులో సైతం ట్రాఫిక్ నిలిచిపోయింది.
7
కనిపించని బోర్డు సభ్యులు..
రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని సైతం రద్దు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సుమారు 90వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీఐపీ దర్శనాలను సైతం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులందరికీ త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. స్కానింగ్ పాయింట్ వద్ద ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు. క్యూలైన్ల ద్వారా స్కానింగ్ పాయింట్‌కు చేరుకున్న భక్తులకు ఏ క్యూలైన్‌లో అయితే ఖాళీ కనిస్తాయో ఆ క్యూలైన్‌లోకి అనుమతించారు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉండగా, కనీసం ట్రస్ట్ బోర్డు సభ్యులు మచ్చుకైనా కనిపించలేదు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయానికి చేరుకుని రద్దీని పర్యవేక్షించారు.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా