దేశంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం విచారకరం. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన హక్కును ప్రభుత్వం కాల్ రాస్తోంది. ఇటీవల సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోగా కక్ష సాధింపులకు దిగుతుండటం సరైన పద్ధతి కాదు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపులకు పాల్పడటం ఎంతవరకు సబబు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి.
వడ్డి జితేంద్ర, న్యాయవాది పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
రాజ్యాంగ హక్కులనే కాలరాస్తారా? ...