జనసేన రౌడీల దుశ్చర్య | - | Sakshi
Sakshi News home page

జనసేన రౌడీల దుశ్చర్య

Sep 13 2025 7:31 AM | Updated on Sep 13 2025 7:31 AM

జనసేన రౌడీల దుశ్చర్య

జనసేన రౌడీల దుశ్చర్య

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

మచిలీపట్నంటౌన్‌: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మద్దాల సతీష్‌ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్‌పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్‌ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్‌ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్‌ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్‌ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్‌ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు.

అందుకే కక్షకట్టారు..

ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్‌ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్‌, సతీష్‌ బాబు తదితర వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్‌ వాయిస్‌ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్‌ వీడియోలో సతీష్‌ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్‌ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్‌ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్‌ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

పెనమలూరు: పెదపులిపాకలో పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామం శ్రీనగర్‌ కాలనీ 6వ రోడ్డుకు చెందిన పుట్టపు గోవిందమ్మ కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఆమె భర్త వ్యవసాయ పనులు చేస్తారు. ఆమెకు ఇద్దరు కుమారులు. గురువారం చిన్నకుమారుడు పుట్టపు పవన్‌కుమార్‌(18) వడ్డేశ్వరంలో పాలిటెక్నిక్‌ కాలేజీకి వెళ్లగా.. పెద్ద కుమారుడు ధనేకుల ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లాడు. కాగా గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు ఇంటికి రాగా.. తలుపులు లోన గడి పెట్టి ఉన్నాయి. అతను కిటికీలో నుంచి చూడగా పవన్‌కుమార్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు తెరిచి కుటుంబ సభ్యులు పవన్‌కుమార్‌ను విజయవాడ జీజీహెచ్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తల్లి గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దళితుడైన సతీష్‌బాబు దుకాణం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement