
సన్న బియ్యం కాదు.. పురుగుల బియ్యం
● విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా ● నిల్వ బియ్యాన్ని పాఠశాలలకు అంటగట్టిన వైనం
నందివాడ: మండలంలోని వెన్ననపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే, అంతకంటే నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవానికి పురుగులతో నిండి ముక్కి పోయిన బియ్యాన్ని వండి పెడుతున్నారు. ఆ పురుగులతో తయారు చేసిన భోజనాన్ని తినలేక విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరచి చూస్తే పురుగులే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సన్న బియ్యం కాకపోయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.