
నేడు సేపక్ తక్రా సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సబ్ జూనియర్స్ బాల బాలికల జిల్లా జట్లను ఎంపికలను గురువారం నిర్వహిస్తున్నామని ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.పవన్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో అనంతపురం ఉరవకొండలోని జెడ్పీహెచ్ స్కూల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 1–1– 2011 తర్వాత పుట్టిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఉదయం 7 గంటలకు 4 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు.
తిరువూరు: విస్సన్నపేట మండలం చండ్రుపట్లకు చెందిన యువతి(23)పై అదే మండలంలోని తాతకుంట్లకు చెందిన వడిత్యా శ్రీనివాస్(25) మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏడాది కాలంగా తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ శారీరకంగా వాడుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో యువతి తల్లిదండ్రులు, యువకుడి కుటుంబ సభ్యులతో కొందరు పెద్దలు రాజీ కోసం మంతనాలు చేసినా.. బాధితురాలు తనకు న్యాయం చేయాలని చెప్పడంతో శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.
కప్తానుపాలెం(మోపిదేవి): కుమార్తె బాధను చూడలేక తన వయస్సును, వృద్ధాప్యాన్ని లక్ష్యపెట్టక తండ్రి కిడ్నీదానం చేసిన ఘటన మండలంలోని కప్తానుపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు వారి ఇంటి వద్ద పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ రెండు కిడ్నీలు కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు కిడ్నీ దానం చేసి ఆమెకు పునర్జన్మ ఇచ్చిన విశ్రాంత టీచర్, మాజీ రాష్ట్ర పీఆర్టీయూ నేత అడవి శ్రీరామమూర్తి అన్నారు. భార్య మరణించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ధైర్యంగా కుమార్తెకు కిడ్నీని దానం చేసిన ఆయన త్యాగానికి ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తిని సత్కరించారు.