
విశ్వనాథ సాహిత్యం అజరామరం
విజయవాడ కల్చరల్: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్యం వెలకట్టలేనిదన్నారు. ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వేముల చారిటీస్ కన్వీనర్ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారుడు యలమంద, శ్రీనివాసరావు, రవికుమార్, పైడేటి భాను పాల్గొన్నారు.
● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్‌లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశ్వనాథ చేపట్టని సాహిత్య ప్రక్రియలేదన్నారు. సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, బోడి ఆంజనేయరాజు, రాంకుమార్, రూపాశ్రీ, సంస్కార భారతి నగర అధ్యక్షుడు పి. భాస్కర శర్మ, డూండీ పాల్గొన్నారు.
● భారతీయ జనతా పార్టీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్‌లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు.