
ఆటిజం నుంచి బాలలను రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆటిజం తల్లి గర్భం నంచే మొదలవుతుందని, ఈ వ్యాధి పిల్లల జీవితంలోకి ప్రవేశించడానికి ముందే అడ్డుకోవా లని రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి తల్లిదండ్రులకు సూచించారు. రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిబిరం 14వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందన్నారు. ఆటిజం సమస్య పరిష్కారంలో వాడే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం 91000 65552 నంబర్‌కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పిల్లలు పుట్టకముందే ఆటిజం సమస్యను నివారించేందుకు ప్రత్యేక చికిత్స ఉందని వివరించారు. ఆటిజం సమస్యకు సంబంధించి మరింత సమాచారం కోసం 98215 29653 సెల్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.