
వైభవంగా శోభాయాత్ర
ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి నూతన కార్యవర్గం
విజయవాడ కల్చరల్: శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రం జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి, విదుశేఖర భారతిస్వామి చారుర్మాస్య దీక్షను శృంగేరీ పీఠంలో విరమించిన సందర్భంగా పీఠ సంప్రదాయాన్ని అనుసరించి దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం, మహాన్యాసం వేదోక్తంగా నిర్వహించారు. ఆదిశంకరుల చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంతో నగర వీధుల్లో శోభాయాత్ర జరిగింది. ధర్మాధికారి హనుమత్ ప్రసాద్, పలువురు భక్తులు పాల్గొన్నారు.