
కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం
చల్లపల్లి: చల్లపల్లి మండల పరిధిలోని నిమ్మగడ్డ కేసీపీ ఎత్తిపోతల తూముల వద్ద కృష్ణానదిలో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కరకట్టకు కొంత దూరంలో ఉన్న ఈ ప్రదేశం నుంచి దుర్వాసన రావడంతో అక్కడ మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. బాగా కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యకిగా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. శరీరంపై బారుచేతుల బిస్కెట్ కలర్ చారల చొక్క, నీలం రంగు ప్యాంటు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రెండు వెండి ఉంగరాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 రోజుల మధ్యలో మరణించి ఉండొచ్చని చెప్పారు. వీఆర్వో పెనుమూడి వెంకటేశ్వరరావు, గ్రామస్థుల సమక్షంలో పంచనామా చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని కృష్ణానది ఒడ్డున ఖననం చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
అవనిగడ్డ: అవనిగడ్డ నుంచి కోడూరు ప్రధాన రహదారిపై బైకు అదుపు తప్పి పడిపోవడంతో మేస్త్రి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కోడూరు మండలం విశ్వనాధపల్లికి గ్రామానికి చెందిన మేసీ్త్ర బత్తుల నాగరాజు(46) అవనిగడ్డ వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఘటనలో నాగరాజు తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.