
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం): గుర్తు తెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని తుమ్మలపాలెం గ్రామంలో 65వ నంబర్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కఠారి శేషగిరిరావు (59) లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. డ్యూటీలో ఉండి హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేందుకు తన కుమారుడు రాంబాబుకు ఫోన్‌చేసి రోడ్డు వద్దకు రమ్మని చెపి లారీని రోడ్డుపక్కన ఆపాడు. లారీ టైర్లులో గాలి చెక్ చేసుకునే క్రమంలో కిందికి దిగాడు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం శేషగిరిరావును ఢీకొట్టింది. కుమారుడు రాంబాబు లారీ వద్దకు వచ్చే సమయానికి తండ్రి మృతి చెంది ఉంటడం గమనించి తల్లికి సమాచారం ఇచ్చాడు. శేషగిరిరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రమేష్ పది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుటుంబ పెద్ద మృతితో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
జి.కొండూరు: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పని చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. అల్లూరిసీతారామరాజు జిల్లా, జీకే వీధి మండల పరిధిలోని ఈకోడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(38) మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేసేందుకు ఈ నెల ఒకటో తేదీన వచ్చారు. ఇటుక బట్టీలో రెండవ తేదీ నుంచి పనిలో చేరిన ఈ ఆరుగురు కార్మికులు, గురువారం ఇటుక బట్టీలో ఉన్న పాత షెడ్డును తొలగించి మరో చోట నిర్మించే పనులను చేపట్టారు. ఈ క్రమంలో సన్యాసిరావు తొలగించిన షెడ్డు నుంచి ఇనుప రాడ్డుని పైకి తీసి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్‌లైనుకు తాకింది. విద్యుదాఘాతానికి గురైన సన్యాసిరావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సన్యాసిరావుని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనడంతో షేక్ మస్తాన్ (69) మృతి చెందాడు. పెనుగంచిప్రోలు మండలం, పాత ముళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌మస్తాన్ జగ్గయ్యపేట పట్టణంలో కూలిపనులు చేసుకుంటూ జీవి స్తున్నాడు. ఉదయం టీ తాగేందుకు అతను బస్టాండ్ బయటకు వచ్చాడు. జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామానికి వెళ్లే పల్లెవెలుగు బస్సు స్టేషన్‌లోకి వెళ్లే ద్వారం నుంచి లోపలకు వెళ్లే క్రమంలో ఆ మార్గంలోనే నడిచివెళ్తున్న మస్తాన్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మస్తాన్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. మస్తాన్‌కు భార్య లేదు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ కె.శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొర్రగుంటపాలెంకు చెందిన డ్రైవర్ కె.శ్రీను కాంట్రాక్టు డ్రైవర్ అని, ఆన్‌కాల్ డ్రైవర్‌గా ఏడాదిగా పనిచేస్తున్నాడని డిపో మేనేజర్ తెలిపారు. పట్టణ ఎస్‌ఐ జి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం