
రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఏడాదిగా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలే నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లా డారు. పాలకులు అధికార మత్తు వీడి వైద్య రంగాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. తురకపాలెంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 30 మంది మృతి చెందారని, ఆరోగ్యశాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెల్లారితే గత ప్రభుత్వాన్ని వివర్శించడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందిందో ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియర్ వైద్యులను అడిగితే చెపుతారని డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రచార ఆర్బాటాలు కాకుండా, మరణాలకు కారణాలు తెలసుకుని, నివారణ చర్యలు చేపట్టా లని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న వారికి సైతం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గంజాయి తరలిస్తున్న
ఐదుగురి అరెస్టు
గుడివాడరూరల్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్‌ఐ పి.గౌతమ్‌కుమార్ గురువారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ మాట్లా డుతూ.. గంజాయి అక్రమ రవాణాపై అందిన విశ్వసనీయవర్గ సమాచారం మేరకు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ పర్యవే క్షణలో స్థానిక ఎఎన్‌ఆర్ కళాశాల వెనుకవైపు తుప్పల ప్రాంతంలో దాడులు చేసి బేతవోలు పెదపేటకు చెందిన గొడవర్తి కిరణ్, బేతవోలుకు చెందిన పడ మట నాగస్వామి, ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఎలమర్తి నాని, కార్మికనగర్‌కు చెందిన మాదాసు రామకోటేశ్వరరావు, ఓర్స్ కిషోర్‌ను అరెస్ట్ చేశామన్నారు. వారికి సహకరించిన ఆరో వ్యక్తి బేతవోలుకు చెందిన పడమట మణికంఠ హనుమాన్ జంక్షన్‌లో దొంగతానికి పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశా మని, ఒకరు జైల్‌లో ఉండగా మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపర్చ న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారని వివరించారు. నిందితులను నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.