
అవనిగడ్డలో..
గన్నవరం నియోజకవర్గంలో..
చిలకలపూడి(మచిలీపట్నం): సంక్షేమ రథసారథి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కృష్ణా జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. తమ అభిమాన నేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో గ్రామగ్రామాన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను మంగళవారం నిర్వహించి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ మాట్లా డుతూ.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ ప్రదాతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచా రని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వాహనాలను ప్రవేశపెట్టి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చారని, పేదలకు ఉన్నత విద్య, వైద్యాన్ని చేరువ చేశారని వివరించారు. జిల్లా లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు.
పామర్రు నియోజక వర్గంలో కైలే అనిల్ కుమార్ ఆధ్వ ర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. మొవ్వ మండలం చినముత్తేవిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యారా సాయిప్రశాంత్ 150 మంది పశువుల యజమానులకు పశువుల దాణా పంపిణీ చేశారు. పామర్రు, పెదపారుపూడి, పమిడిముక్కల, తోట్లవల్లూరు, మొవ్వ మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు రాజులపాటి రాఘవరావు, కాకర్ల వెంకటేశ్వరరావు, సురేష్‌రెడ్డి, జొన్నల రాజమోహన్‌రెడ్డి, ఆరేపల్లి శ్రీనివాస్, ఏనుగు రమణకుమారి, కాకాని వేదసుప్రజ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. జిల్లా కోర్టు సెంటర్, నాగపోతరావుసెంటర్, ఓగీస్‌పేట తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న, నాయకులు గూడవల్లి నాగరాజు, తిరుమలశెట్టి ప్రసాద్, కొలుసు హరిబాబు, షేక్ అచ్చేబా, మట్టా నాంచారయ్య, జన్ను రాఘవ, గణేశన రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల థామస్ నోబుల్ ఆధ్వర్యంలో స్నేహాలయంలో మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు.
పెనమలూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో యనమలకుదురులో పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈడ్పుగల్లు, కంకిపాడు, వంగ వీటి రంగా విగ్రహం వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఉయ్యూరు నగర పంచా యతీ పరిధిలోని దళితవాడలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, పార్టీ నాయకులు రామినేని రమాదేవి, ప్రతివాడ రాఘవరావు, పిడికిడి రామకోటేశ్వరరావు, పాలడుగు శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ నియోజకవర్గ పరిధిలో పార్టీ సీనియర్ నాయకుడు దుక్కుపాటి శశిభూషణ్ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని విగ్రహాలకు పూలమాల వేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, ఎం.వి.నారాయణరెడ్డి, మాట్టా జాన్‌విక్టర్, సయ్యద్, ఎంపీపీ పెయ్యల ఆదాం, కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పెడన నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రమేష్ (రాము) ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో, పెడన పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్, మైలా రత్నకుమారి, ఎంపీపీ కూనసాని ప్రసాద్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో, వంతెన సెంటరులో మహానేత విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ తుంగల సుమతి, జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు నలకుర్తి రమేష్, గుర్రం బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
● వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
● వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు
పూలమాల వేసి నివాళులు
● పలు ప్రాంతాల్లో అన్నదాన
సంతర్పణలు, సేవా కార్యక్రమాలు
● స్వచ్ఛందంగా పాల్గొన్న అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు
మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పేర్ని కిట్టు, నాయకులు
గుడ్లవల్లేరులో వైఎస్సార్ విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

అవనిగడ్డలో..

అవనిగడ్డలో..