
‘రెడ్‌బుక్’తో అరాచకాలు అధికమయ్యాయి
పెడన: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకాలు అధికమయ్యాయని, మహిళలపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. గురువారం ఆయన పెడన మండలం కృష్ణాపురంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము దంపతుల నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆయనతో పాటు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుల్లా మేరీకుమారి, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షుడు నరేంద్రసింగ్, ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, బలిజ సంఘం రాష్ట్ర కన్వీనర్ పాల రాంబాబు, నరసాపురం చేనేత విభాగం అధ్యక్షుడు కరేళ్ల ముక్తేశ్వరరావు, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ చల్లబోయిన ఆంజనేయులు, గౌడ సంఘ నాయకుడు బొక్కా సత్యనారాయణ, రజక సంఘ నాయకులు చెంచినాడ జైశ్రీను, వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీరంశెట్టి పూర్ణచంద్రరావు, కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్ తదితరులు హారిక, రాము దంపతులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఏపీని దిగజారుస్తున్న ఎన్డీయే సర్కార్
వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఆడవారిపై దాడులు చేసే నీచ సంస్కృతికి ఎన్టీయే కూటమి ఏపీని దిగజార్చే స్థితికి తీసుకువస్తోందన్నారు. ఎదుటివారిపై దాడి చేయడమే కాకుండా బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి హింసించాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ మాట్లాడుతూ గుడివాడలో రాము, హారిక దంపతులపై దాడి దారుణమన్నారు. చంద్రబాబు పేదలకు అన్యాయం చేసి కర్రపెత్తనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆయన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎంబీసీ విభాగం అధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు అక్కడే ఉన్నా టీడీపీ, జనసేన గూండాల దాడులను నిలువరించకపోవడం దారుణమన్నారు. ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఉప్పాల హారికకు నేతల పరామర్శ