
హే స్వామినాథా కరుణాకరా..
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆషాఢ కృత్తిక మహోత్సవాలను గురువారం వైభవంగా ప్రారంభించారు. దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో 11 మంది రుత్వికులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, అభిషేక జల సంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం ఇతర పూజలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు వాస్తుహోమం, అంకురా రోపణ, ప్రధాన దేవతా సహిత సర్వతో భద్ర మండపారాధన, పట్టు పవిత్రాలు, ఆసాధన, చతుర్వేద స్వస్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేదపండితుడు ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన దోషాలు తొలగడానికి అభివృద్ధికి, భక్తుల సంకల్ప సిద్ధికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు అచ్యుత మధుసూదనరావు, బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
ఆలయంలో ప్రత్యేక పూజలు

హే స్వామినాథా కరుణాకరా..