
నిషేధిత భూములకు విముక్తి కలిగించాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: ఎన్నో ఏళ్లుగా 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై అనుభవదారులకు సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంగళవారం నగరంలోని 4, 5 డివిజన్ల పరిధిలోని సర్కారుతోటలో ఉన్న సెక్షన్ 22 (ఏ)లో నమోదైన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేడు వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించామన్నారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి..
కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు. బందరు ఆర్డీఓ కె. స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు.