కోనేరుసెంటర్: ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో సమస్యకు పరిష్కారం చూపుతామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అర్జీదారులను అవమానిస్తూ మాట్లాడినట్లు తెలిసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు