ఆసిఫాబాద్‌అర్బన్: అనాదిగా తెలంగాణకు ఘనమైన చరిత్ర, అఖండ వారతస్వం ఉందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఆవి ష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందన్నారు. శాంతిభద్రత పరిరక్షణలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నీతి, నిజాయతీతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసు శాఖకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


