ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక స్థోమత లేని ఖైదీల కు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనుష తెలిపారు. జిల్లా కేంద్రంలోని జైలును గురువారం సందర్శించారు. బ్యారక్‌లు, వంటగది, ఇతర సౌకర్యాలతోపాటు ఖైదీలకు అందుతున్న వైద్య సదుపాయాలను స్వయంగా తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని రిమాండ్, అండర్ ట్రయల్ ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ తరఫున ఉచితంగా లీగల్ అండ్ కౌన్సిల్‌ను కేటా యిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, వెంకటేశ్వర్లు, అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.


