రెబ్బెన: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలతో ఉత్పత్తి వేగవంతం చే యాలని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగి రి నరేందర్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ వద్ద గురువారం నూతన షావెల్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాకు నిర్దేశిత వార్షిక లక్ష్య సాధనకు యంత్రాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. పూర్తి పని గంటలు వినియోగిస్తే సంస్థపై వ్యయం తగ్గుతుందని తెలిపారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా ఇంజినీర్ వీరన్న, ప్రాజెక్టు ఇంజినీర్ నరేష్, మేనేజర్ శంకర్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, సంక్షేమ అధికారి రజనికుమార్ తదితరులు పాల్గొన్నా రు.


