తెలంగాణ ప్రజల పోరాటం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజల పోరాటం చిరస్మరణీయం

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: సెప్టెంబర్‌ 17 చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన రోజు అని, నాడు తెలంగా ణ ప్రజలు జరిపిన పోరాటం చిరస్మరణీయమ ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజ ల ఆకాంక్షలు, హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడు ముందుండి పని చేస్తుంద ని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏఎంసీ చైర్‌పర్స న్‌ మంగ, మండల అధ్యక్షుడు రాపర్తి మురళీ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్‌, భాగ్యలక్ష్మి, సాయి, గోవింద్‌, కృష్ణమ్మ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement