ఆసిఫాబాద్‌రూరల్: ఉన్నతి విద్యాప్లస్‌లో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని, తరగతి గదుల్లో ఏఐ ఆధారిత బోధనా పద్ధతులు పాటించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆసిఫాబాద్ బాలుర ఉన్నత, తి ర్యాణి ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠ్యాంశాలు బోధిస్తున్న విధానం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్‌ను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత బోధన సహయక వ్యవస్థను వినియోగించి పాఠ్యాంశాల సారాంశం, వీడియోలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.


