అడవుల రక్షణకు ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

అడవుల రక్షణకు ప్రత్యేక నిఘా

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

పెంచికల్‌పేట్‌: అడవుల రక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో భార్గవ్‌ అన్నారు. మండలంలోని చేడ్వా యి, ఎల్కపల్లి గ్రామాల్లో అటవీశాఖ భూములను గురువారం పరిశీలించారు. రెవెన్యూ, అ టవీ భూముల హద్దుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేడ్వాయి నర్సరీని తనిఖీ చేశారు. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణ, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్‌వో అనిల్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement