పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 17 2026 11:53 PM | Updated on Jun 17 2026 11:53 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: పర్యావరణ పరిరక్షణ ప్రా ధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం, వారిలో బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌– నేషనల్‌ స్టూడెంట్‌ పర్యావరణ కాంపిటేషన్‌– 2026 పోస్టర్‌ను బుధవారం జిల్లా కేంద్రంలో డీఈవో సచ్చిదానంద చారి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తన తల్లి పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ లతీఫ్‌, క్వాలిటీ కోఆర్డి నేటర్‌ శ్రీనివాస్‌, ఐఈ సీఎంవో కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఎంఈవోలు ఆడే ప్రకాశ్‌, జయరాజ్‌, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement