రెబ్బెన: ప్రజాప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలిసి హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, ఇన్‌చార్జి మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి, నాయకులు బలరాం నాయక్, ఎర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


