ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

రెబ్బెన: మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించి, న్యాయం చేయాలని చిరువ్యాపారులు కోరారు. మండల కేంద్రంలోని చిరు వ్యాపారులు, దుకాణాదారులు సోమవారం స్వచ్ఛందంగా ఒకపూట బంద్‌ పాటించారు. అలాగే కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలిసి కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, మండల కేంద్రంలో తహసీల్దార్‌ సూర్య ప్రకాశ్‌కు వినతి పత్రాలు అందించారు. వారు మట్లాడుతూ దా దాపు 60 ఏళ్లుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ రెవెన్యూ భూమిలో చిన్న షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. స్థలం రైల్వే భూమి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలి పారు. రైల్వే, రెవెన్యూ జాయింట్‌ సర్వేలో 38 ఎకరాలు రైల్వే భూమి పోగా, మరో 7.26 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు తేలిందన్నారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించి ఆదుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement