ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్‌.త్రివేణి డిమాండ్‌ చేశారు. ఆదివారం మిల్లు గేటు ముందు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను యాజమాన్యం, నాయకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు సీఐటీయూ అండగా నిలుస్తుందని తెలిపారు. యాజమాన్యం కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, స్వరూప, యూ నియన్‌ జిల్లా నాయకులు లక్ష్మి, పంచశీల, సరస్వతి, రజిని, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement