ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ డీడీఎన్ సంఘం డివిజన్ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఆ దివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గంగు సత్యనారాయణశర్మ, జిల్లా అధ్యక్షుడు ఒజ్జల శిరీష్‌శర్మల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా జంబోజు తిరుపతిచారి, కార్యదర్శిగా జాదవ్ ధన్‌రాజ్, కోశాధికారిగా అభయ్‌కుమార్ ఆచార్యలను ఎన్నుకున్నారు. నాయకులు సుబ్బా మహేశ్, ఇందారపు శంకర్, డిల్లీ విజయ్‌కుమార్, మురళీధర్, సతీశ్, కులకర్ణి, సత్యనారాయణ, శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


