ఆసిఫాబాద్‌రూరల్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతపడిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. పాఠశాలల్లోని తరగతి గదులు శుభ్రం చేయించి సిద్ధం చేశారు. మొదటి రోజు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయడంతో గతం కంటే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు జిల్లాలో 928 మంది బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,258 పాఠశాలలు ఉండగా డీఈవో పరిధిలో 738 పాఠశాలలు ఉన్నాయి. మిగితా 520 పాఠశాలలు గిరిజన ఆశ్రమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సుమా రు 86 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. డీఈవో పరిధిలో 738 పాఠశాలల్లో సుమారు 39,249 మంది విద్యార్థులు చదువుతుండగా 2,072 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జి ల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 86శాతం 90,320 పుస్తకాలు వచ్చాయి. అయితే 2, 3,7వ తరగతులకు చెందిన ఇంగ్లిష్, 6, 7వ తరగతులకు చెందిన హిందీ పుస్తకాలు రాలేదు. యూనిఫాంకు సంబంధించి ఈ ఏడాది రంగులో మార్పు చేయడంతో ఇంకా యూనిఫాం కుట్టే పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో నెల రోజుల పాటు పాత యూనిఫాంలే విద్యార్థులు ధరించాల్సి ఉంటుంది.
జిల్లాకు దక్కని ‘అల్పాహారం’..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ పథకా న్ని నేటి నుంచి అమలు చేయనుంది. తొలి విడతలో 8 జిల్లాల్లోని 1,269 పాఠశాలలు, 13 కళాశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు. అందులో కు మురం భీం జిల్లాకు అవకాశం రాలేదు. వికారాబా ద్, నారాయణ పేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నేటి నుంచి అల్పాహారం అందించనున్నారు. మిగితా జిల్లాల్లో రెండో విడతలో అందిస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
నాణ్యమైన విద్య అందిస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందిస్తాం. ఉపాధ్యాయుల కు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుతో డుమ్మాలకు అవకాశం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి విద్య సామర్థ్యాలు పెంచేలా కార్యాచరణ తయారు చేస్తున్నాం.
– సచ్చిదానంద, డీఈవో
కెరమెరి: బుడిబుడినడకలు వేస్తూ నేటి నుంచి చి న్నారులు అంగన్‌వాడీలకు వెళ్లనున్నారు. మే 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించిన ప్ర భుత్వం.. మండుతున్న ఎండల దృష్ట్యా మరో 14 రోజులు పెంచింది. దీంతో సోమవారం అంగన్‌వాడీ కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి. సె లవుల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు, కిశోరబాలికలకు ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేశారు.
సమస్యల్లో అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలోని అనేక అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యల్లో మగ్గుతున్నాయి. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదు. ఏటా ఇబ్బందులు పడుతున్నా అధికారులు కేంద్రాలపై చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఉప్మా లేదా కిచిడి మిక్స్ టిఫిన్‌గా అందించనున్నారు. చిన్నారులకు ప్రీస్కూల్ కిట్ అందించనున్నారు. రెండు జతల యూనిఫాంలు ఆయా కేంద్రాలకు చేరడంతో నేటి నుంచి పంపిణీ చేయనున్నారు.
సిబ్బంది కొరత..
జిల్లాలోని అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉంది. చాలా చోట్ల ఆయాలు, అంగన్‌వాడీలు లేక సమీప కార్యకర్తలకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాలను నిర్వహించడం వారికి ఇబ్బందిగా మారింది. ఇన్‌చార్జీలు ఉన్న చోట కేవలం సరుకులు పంపిణీకే పరిమితమవుతున్నారు. చిన్నారులకు అందాల్సిన ప్రీస్కూల్ కార్యక్రమాలు కొనసాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని కేంద్రాలు అంగన్‌వాడీలు, ఆయాలు లేక మూతబడి ఉంటున్నాయి.
అంగన్‘బడు’లు సైతం ప్రారంభం


