ఆసిఫాబాద్: బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు ఒకరికి ఒక్కచోట మాత్రమే ఓటుహక్కు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఎన్నికలకు ఓట రు జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నా రు. అనర్హులను తొలగించి అర్హులతో కూడిన కొత్త ఓటరు జాబితా రూపొందించేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు కేంద్రం సిద్ధమైంది. 2002లో జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతోంది. ఈ ప్రకియ జల్లాలో జనవరి 31న ప్రారంభం కాగా, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,57,018 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,625 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యింది.
100 శాతం పూర్తయ్యేలా చర్యలు..
జిల్లాలో ఇప్పటి వరకు 82.41 శాతం మ్యాపింగ్ ప్ర క్రియ పూర్తయ్యింది. ఈ ప్రక్రియ వేగవంతం చే యాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హరిత జిల్లాలోని అధికారులతో ఇప్పటికే ప లుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ నెలాఖరులోగా 100శాతం ప్రక్రియ పూర్తయ్యేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఆధార్, భద్రతా పరిశీలన, చిరునామాలు, బయోమెట్రిక్ సరి చూసుకోవడం, ఓటర్ల స్థలానుసారం మ్యాప్ తయారీ వంటి కీలక దశలు చేపట్టనున్నారు. జియో ట్యాగింగ్, డిజిటల్ ఫారాలు, ఫొటో వ్యాలిడేషన్ ద్వారా డేటా సేకరిస్తున్నారు. నాణ్యమైన ఓటర్ల డేటా బేస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అక్టోబర్ 1న తుది జాబితా..
సర్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, జాబితా ముద్రణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయింలు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 28లోపు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు.
గందరగోళం లేకుండా..
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే ఎన్నికల ని ర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. సమగ్ర మ్యాపింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్లా నింగ్, సిబ్బంది నియామకం, వాహనాల ఏర్పాట్లు వంటివి మరింత సక్రమంగా చేసే అవకాశం ఉంటుంది. 2002లో పేరు, తల్లిదండ్రుల పేర్లు ఉంటే ప్రత్యేక రుజువులు చూపాల్సిన అవసరం లేదు. బీ ఎల్‌వోలకు అవసరమున్న డాక్యుమెంట్లు చూపాల్సి ఉంటుంది. ఓటర్లకు చిరునామా గుర్తింపులో అవరోధాలు తొలగిపోతాయి. బీఎల్‌వోలు గడపగడపకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు జియో ట్యాగ్ ఫొటోలు, ఆధార్‌తో నమోదు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ రోజున ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలున్నాయి.
గుర్తింపు కార్డు సమర్పించాలి
మ్యాపింగ్, ఓటరు నిర్ధారణ వంటి సమస్యలుంటే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌లైసెన్స్, పాన్‌కార్డు, పింఛన్ కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డుల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
– లోకేశ్వర్ రావు, ఆర్డీవో


