విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

● పోటీ పరీక్షలపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన ● ఉద్యోగాలు పొందుతున్న యువత ● నేటి నుంచి ఉచిత శిక్షణ తరగతులు

కాగజ్‌నగర్‌టౌన్‌: డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యో గం ఎలా సాధించాలి..? పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..? ఉన్నత విద్యకు ఏ మార్గాలు ఎంచుకోవాలి..? అనే సందింగ్ధంలో ఉండే విద్యార్థుల కు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దారి చూపుతోంది. కళాశాలలో కేవలం పాఠ్యాంశాలకే పరిమి తం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్‌, రైల్వే, పోలీస్‌, ఫారెస్ట్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్స్‌ వంటి వివిధ పోటీ పరీక్షల కు అవసరమైన అంశాలపై కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ద్వా రా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు.

2019 నుంచి పోటీ పరీక్షలపై శిక్షణ..

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2019 నుంచి డిగ్రీ చదువుకునే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిపుణులతో ఉద్యోగాలు సాధించేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణలో భాగంగా పోటీ పరీక్షలకు ప్ర త్యేక తరగతులు, వారానికోసారి మాక్‌ టెస్ట్‌, వ్యక్తి త్వ వికాస శిక్షణ, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై మార్గదర్శనం, కెరీర్‌ కౌన్సెలింగ్‌, ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు డిగ్రీలో ఉండగానే పోలీస్‌, అగ్నివీర్‌, ఆర్మీ, ఫారెస్ట్‌బీట్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలు పొందుతున్నారు.

అగ్నివీర్‌కు ఎంపిక

మాది రెబ్బెన మండలంలో ని ఖైరిగూడ గ్రామం. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న. ఈ నెల 2న అగ్నివీర్‌కు ఎంపికై నట్లు కాల్‌లెటర్‌ వచ్చింది. ఈ నెల 10న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యాను. డిగ్రీ ఫైనల్‌ఇయర్‌లోనే ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉంది.

– కమినవేని సతీశ్‌, అగ్నివీర్‌

వ్యవసాయ కుటుంబం నుంచి..

మాది వేంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు మాండోరె నారాయణ –భాగ్యలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దేశ సేవ చేసేందుకు అగ్నివీర్‌గా నాకు అవకాశం వచ్చింది. నేను కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే శిక్షణ తీసుకున్న.

– మాండోరె శంకర్‌, అగ్నివీర్‌

కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement