‘బాయిబాట పోరాటం మరింత ఉధృతం’ | - | Sakshi
Sakshi News home page

‘బాయిబాట పోరాటం మరింత ఉధృతం’

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

రెబ్బెన: సింగరేణి పరిరక్షణ కోసం బాయిబాట పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్‌ఎంఎస్‌ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లోని హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కోసం హెచ్‌ఎంఎస్‌ గౌరవ అధ్యక్షురాలు క ల్వకుంట్ల కవిత, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్‌ హైమద్‌లు పోరాటాలను ఉధృతం చేస్తున్నారన్నారు. కొత్త గనుల ఏర్పాటు లేక సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. కొత్త గనులను ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. మెడికల్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట గని వద్ద నేటి బాయిబాట కార్యక్రమానికి హెచ్‌ఎంఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతారని తెలిపారు. ఏరియాలోని హెచ్‌ఎంఎస్‌ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, సెంట్రల్‌ నాయకులు ఎండీ ఓజియార్‌, ఏరియా ఆర్గనైజర్‌ ఎస్‌కే ఇనూస్‌, కిష్టస్వామి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement