కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సర్‌సిల్క్ కా లనీలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ శుక్రవారం ముగిసింది. మే1 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన కోచింగ్ శిబిరానికి బాలబాలికలు హాజరై బాక్సింగ్‌లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకున్నట్లు బాక్సింగ్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిబి రంలో నేర్చుకున్న నైపుణ్యాలు మరింత మెరుగుపర్చుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పో టీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. శిబిరాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన వా రిని అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ జయేందర్, శివకుమార్, మధురై శేఖర్, అశ్వక్‌హైమద్, కోనేరు శ్రీకాంత్, రాకేశ్, సాయికుమార్, శివ, వంశీ, క్రీడాకారులు పాల్గొన్నారు.


