భీం చరిత్ర స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

భీం చరిత్ర స్ఫూర్తిదాయకం

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

కెరమెరి: పోరాటయోధుడు కుమురం భీం చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని శిక్షణ ఐఏఎస్‌లు హరిప్రసాద్‌, సాయి సురేశ్‌, సాయి శివాణి, శ్రీకాంత్‌రెడ్డి, సచిన్‌ బజవర గొట్టు, పారస్‌కుమార్‌ అన్నారు. మండలంలోని జోడేఘాట్‌ను బుధవారం సందర్శించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం భీం మ్యూజియాన్ని సందర్శించారు. గుప్పాడీ చేస్తున్న నృత్యాలు, ఆదివాసీలు ఆయుధాలు, ఆభరణలు, ఫొటో గ్యాలరీ, దేవతల ప్రతిమలను పరిశీలించారు. భీం పోరాటంతో ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులు అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో భాస్కర్‌, క్యూరేటర్‌ దుందేరావు, హెచ్‌ఎం మోతీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement