తిర్యాణి: ఆదివాసీ నాయకులు కుమురంభీం, ఎడ్ల కొండు జన్మస్థలమైన ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లిలో ఈ నెల 29న కుమురంభీం స్ఫూర్తితో గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గుణవంత్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని కుమురంభీం చౌరస్తా వద్ద బుధవారం ఆదివాసీ నాయకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. గ్రామోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపా రు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లా సార్మెడి కుర్సింగ మోతీరాం, మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, సర్పంచులు శంకరమ్మ, కృష్ణ, నరేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.


