కాగజ్‌నగర్‌టౌన్: సమస్యలు పరిష్కరించాలని కో రుతూ బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచ ర్లు, హెల్పర్లకు ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలి పారు. ప్రతినెలా 1న వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఐసీడీఎస్ లను బలోపేతం చేసి ప్రీప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని, ఆయా, టీచర్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని, ఎన్‌ఈపీ 2020 విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు అరుణ, సునీత, రాణి, జయగోల్లాగ్, లక్ష్మి, అరుణ, ఉమాదేవి పాల్గొన్నారు.


