ఆసిఫాబాద్‌అర్బన్: ఐకేపీ(సెర్ప్) వీవోఏలు ఈ నెల 18 నుంచి ప్రకటించిన సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు బుధవారం జిల్లా కేంద్రంలో జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భీమేశ్, ప్రధాన కార్యదర్శిగా దేవనపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా శ్రీధర్, కోశాధికారిగా వనిత, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్వప్న, గౌరవ అధ్యక్షుడిగా మధుకర్, సహాయ కార్యదర్శులుగా సంతోష్, ప్రపూర్ణ, భరత్, సభ్యులుగా తిరుపతి, శ్రీనివాస్‌గౌడ్, స్వాతి, మహేశ్వరీ, దత్తు, భా గిలాల్, తులసీరాం, సతీశ్, జయంత్, సుజా త, దివ్వజ్యోతి, సంతోష్, విలాస్‌ను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు భీమేశ్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో సమన్వయ కమిటీలు ఏ ర్పాటు చేసి పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బ తీసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.


