పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. కెరమెరి మండలం కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడ గ్రామాన్ని బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి సందర్శించారు. దారి పొడవునా మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న కొఠారి సర్పంచ్ మడావి శాంతాబాయి ఇంట్లోకి వెళ్లి పరిశీ లించారు. సొంతంగా నిర్మించారా? కాంట్రా క్టర్ నిర్మించారా అని అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడలో 26 ఇల్లు మంజూరు కాగా, మూడు పూర్తయ్యాయని, మరో 23 ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని సర్పంచ్ వారికి వివరించారు.


