దాహార్తి తీరుస్తున్న ఆటో డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

దాహార్తి తీరుస్తున్న ఆటో డ్రైవర్‌

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మండుటెండల్లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఆటోలో చల్లటి మంచినీటి క్యాన్‌ ఏర్పాటు చేసుకుని ఓ డ్రైవర్‌ మానవత్వం చాటుతున్నాడు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని గుంటూరు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ ఎండీ శంషొద్దీన్‌ ఎనిమిదేళ్లు ఏటా ఎండాకాలంలో తాగునీటి క్యాన్‌ను ఆటోలో పెడుతున్నాడు. దాహం వేసిన వారికి నీటిని అందిస్తున్నారు. ‘నాకు పెద్దగా సంపాదన లేదు.. కానీ ఎండలో నీళ్లు లేక ఇబ్బంది పడేవాళ్లను చూస్తే బాధగా ఉంటుంది. అందుకే 20 లీటర్ల నీటిని ఆటోలో పెట్టుకుంటా.. దాహం వేసిన వాళ్లు ఎవరైనా సరే నీళ్లు తాగొచ్చు. అదే నాకు పుణ్యం..’ అని శంషొద్దీన్‌ చెబుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement