పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

సిర్పూర్‌(టి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జాతీయ హరితదళం జిల్లా కో ఆర్డినేటర్‌ కటకం మధుకర్‌ అన్నారు. మండ ల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ హరితద ళం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చే యాలన్నారు. ప్లాస్టిక్‌ నివారణ, మొక్కలు నా టడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై పాటలు, నృత్యాలు, నాటకాలతో అలరించారు. అనంతరం వారి కి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు దేవ్‌రావ్‌, ఉపాధ్యాయులు జమునదాస్‌, సంతోష్‌, సందీప్‌, భూమన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement