● 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
కౌటాల: జిల్లా నిప్పుల గుండంలా మారింది. భానుడు భగ భగ మండుతుండటంతో బుధవారం పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌లో తొలిసారి 46 డిగ్రీల మార్కు దాటాయి. గాలిలో తేమ తగ్గి వడగాలులు వీస్తుండటంతో పట్టణాలు, పల్లెలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో 12 రెడ్‌జోన్‌లో ఉండగా.. మిగితా మూడు మండలాలు అ లెర్ట్ జోన్‌లో ఉన్నాయి. ఒక్క మండలం కూ డా వాచ్ జోన్‌లో లేకపోవడం గమనార్హం. బుధవారం కౌటాల, ఆసిఫాబాద్, దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్(టి)లో గరిష్ట ఉష్ణోగ్రత 46.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుగా కాగా, తిర్యాణి, రెబ్బెనలో 46.2 డిగ్రీలు, కుంచవెల్లి 46.1, చింతలమానెపల్లి 46.0, లోనవెల్లి 45.9, గిన్నెధరి 45.7, వెంకట్రావ్‌పేట్ 45.6, వంకులం, బెజ్జూర్, పెంచికల్‌పేట్ 45.5, వాంకిడి 45.1, ధనోరాలో 45.0 డిగ్రీలుగా నమోదైంది.
వడదెబ్బ ముప్పు
మరో వారం రోజులపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గాలిలో తేమ కనిష్ట స్థాయికి పడిపోవడం, వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తుండటంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలువులు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సాధారణ తీసుకుంటూనే అత్యవసరమైతే తప్పా మండే ఎండల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచించారు.
ముగిసిన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో రాందాస్ తెలిపారు. చివరిరోజు సెకండియర్ ఒకేషనల్ పరీక్షకు ఐదుగురు విద్యార్థులకు అందరూ హాజరయ్యారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించామన్నారు.


