ఆసిఫాబాద్: జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న కెరమెరి మండలం కొఠారిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. గ్రామంలోకి వెళ్లే సీసీ రోడ్డు విస్తరించి, నూతనంగా నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
అటవీ సరిహద్దు వివాదాలు పరిష్కరించాలి
జిల్లాలోని రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్‌వో బాలామణి, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ సభ్యులుగా, డీఎఫ్‌వో కన్వీనర్‌గా జిల్లా భూకొలతల అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. అలాగే డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, సబ్‌డివిజన్ పోలీస్ అధికారి సభ్యులుగా, ఎఫ్‌డీవో కన్వీనర్‌గా, డివిజన్ భూకొలతల అధికారి సభ్యులుగా కమిటీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా భూకొలతల అధికారి వినయ్, అధికారులు పాల్గొన్నారు.


