ప్రతిరోజూ మంచిర్యాల జిల్లా నెన్నెల నుంచి మామిడి పండ్లు విక్రయించేందుకు ఆసిఫాబాద్‌కు వస్తుంటా. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు పక్కన వ్యా పారం చేసుకుంటాను. ఎండ తీవ్రతకు ఆసిఫాబాద్‌కు వచ్చేలోపే నీళ్లు అయిపోతున్నాయి. వేడినీళ్లు తాగలేకపోతున్నాం. చలివేంద్రాలు ఉంటే చల్లని నీళ్లు అందుబాటులో ఉండేవి.
– జయ, నెన్నెల, మంచిర్యాల జిల్లా
కొనక తప్పడం లేదు
గతంలో మాదిరిగా ఆసిఫా బాద్ పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు లేవు. హోటళ్ల వద్ద నీళ్లు తాగనీయడం లేదు. దాహం తట్టుకోలేక బాటిళ్లు కొనక తప్పడం లేదు. కూలీ పనులు చేసుకునేవారు నీటికి ఖర్చు చేస్తే ఎలా బతకాలి.
– తామ్డె సావిత్రీబాయి, హీరాపూర్
పట్టించుకుంట లేరు
ఎండ తీవ్రతతో కొంత దూరం ప్రయాణిస్తే దాహం వేస్తోంది. మార్చిలోనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకుంటలేరు. ఆర్థికంగా ఉన్నవారు డబ్బులు పెట్టి బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. – రాకేశ్, ఎఫ్‌కాలనీ, కాగజ్‌నగర్
రెండు రోజుల్లో ఏర్పాటు
ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రయాణికుల పరిస్థితిని గమనించి రెండు రోజుల్లోగా పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలైన బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ ఏరియాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్


